చార్‌ధామ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన మిగతా ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు…
ఇటీవల కేరళలో పాచిపోయిన షవర్మా తిని చాలా మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో ఓ బాలిక చనిపోయింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలన కలుగచేసింది. మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫుడ్ ప్రాణాలను మీదికి తెస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్ లో బిర్యాణీ ఆర్డర్ చేస్తే అందులో బల్లి కనిపించడం..వెంటనే గమనించిన కస్టమర్లు వాంతులు చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. తాజాగా కల్తీ ఆహారంతో ఎంత ప్రమాదమో తెలిపే మరో ఘటన చోటు చేసుకుంది.…
బండి .. బండి రైలు బండి.. వేళకంటూ రాదులేండి.. దీన్ని గాని నమ్మూకుంటే ఇంతేనండీ.. ఇంతేనండీ.. నితిన్ నటించిన ‘జయం’ సినిమాలోని పాట మీకు గుర్తుందా? దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అందుకే సినిమాల్లో కూడా పాట రూపంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే ఈ అపవాదను పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి.…
కంటికి కనిపించేవన్నీ నిజం కావు అన్నట్టు.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకొనే ప్రతీ బిచ్చగాడు పేదోడు కాదు. వాళ్ళలో కొందరు బిచ్చం ఎత్తుకునే, ఎంతో డబ్బు సంపాదించి ఉంటారు. కొందరు కోటీశ్వరులుగా అవతరించిన వాళ్ళను సైతం మనం చూశాం. ఇప్పుడు తాజాగా ఓ బిచ్చగాడు తన భార్య కోరిక తీర్చాడు. ఆ కోరిక ఖరీదు పదో పరకో కాదు.. అక్షరాల రూ. 90 వేలు! ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లో సంతోష్ కుమార్ సాహు అనే ఓ…
మధ్య ప్రదేశ్ లో శనివారం దారణం చోటు చేసుకుంది. గుణ జిల్లా సాగా బర్ఖేగా అటవీ ప్రాంతంలో కృష్ణజింకలను వేటాడుతున్నరనే పక్కా సమాచారంలో వెళ్లిన ముగ్గురు పోలీస్ అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. రాజధాని భోపాలకు 160 కిలోమీటర్ల దూరంలోని ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ఎస్సై రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఈ ఘటనపై మధ్య…
మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ గుణ జిల్లాలోని సాగా బర్ఖెగా గ్రామంలో అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి కృష్ణజింకలను వేటాడుతున్నారనే పక్కా సమాచారంతో వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో వేటగాళ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సబ్ ఇన్ స్పక్టర్ రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు.…
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి చాలా మంది జీవితాల్లో చీకటి నింపింది.. కుటుంబం మొత్తం ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా ఉన్నాయి.. ఇక, కొందరు కుటుంబ పెద్దను కోల్పోతే.. మరికొందరు కొడుకులను.. ఇంకా కొందరు కోడళ్లను, మనవలు, మనవరాళ్లు.. ఇలా ఎంతో మందిని కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. మన అనుకున్నవాళ్లే దూరం పెట్టే రోజులు కూడా చూపింది కరోనా.. అయితే, మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ దంపతులు చేసిన పనిపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.. సాధారణంగా అత్తమామలు అంటే..…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్త సమయానికి కరెంట్ పోవడంతో, పీటలపై ఉన్న వరుడు మారిపోయాడు. పెళ్ళి కూడా జరిగిపోయింది. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే.. అసలు విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉజ్జయిన్‌కి చెందిన రమేశ్‌కు నిఖిత, కరిష్మా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ ఒకేసారి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్న రమేశ్.. వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో తన కూతుళ్ళ పెళ్ళిని నిశ్చయించాడు. ఎట్టకేలకు పెళ్ళి…
ఓ మహిళను లాయర్ వెంటపడి మరీ చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా కోర్టు ప్రాంగణంలోనే! చుట్టుపక్కలున్న జనాలు సైతం చూస్తుండిపోయారే తప్ప, అతడ్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, అది వైరల్ అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భారతి పటేల్(23) అనే ఓ మహిళ తన భర్త నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే భరణం కోసం కోర్టులో…
ఓ వ్యక్తి 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం సాగిస్తున్నాడు.. వారికి ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు.. ఆయన వయస్సు 42 ఏళ్లు.. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో గిరిజన ఆచారాల ప్రకారం 42 ఏళ్ల వ్యక్తి మౌర్య.. సహజీవనం చేసిన ముగ్గురు మహిళలను ఒకేసారి వివాహం చేసుకున్నాడు.. ముగ్గురు మహిళలతో అతనికి ఉన్న ఆరుగురు పిల్లలు కూడా వివాహ ఆచారాలలో పాల్గొన్నారు.…