ఓ వైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నాం, వైద్యంలో మన పరిస్థితి ఏంటి? కనీస అవసరాల కల్పనలో మనం ఎక్కడున్నాం..? సాటివారిపట్ల మానవత్వం కూడా చూపించలేకపోతున్నామా? లాంటి విషయాలను తేటతెల్ల చేస్తుంటాయి.. తాజాగా, తన నాలుగేళ్ల కుమారుడి శవాన్ని ఓ తండ్రి.. తన భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి చేరుకున్న దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…
Read Also: Samantha : విడాకులపై వివరణ తప్పదా..!
ఛతార్‌పూర్ జిల్లాలోని పౌడీ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. అయితే, మొదట బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లిన కుటుంబసభ్యులు.. బాలుడి పరిస్థితి మరింత విషమంగా మారడంతో.. ఆ తర్వాత దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, మంగళవారం రోజు ఆ బాలుడు మృతిచెందాడు.. తన బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బాలుడి తండ్రి.. ఆ తర్వాత ఏదైనా వాహనం సమకూర్చమని స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నారు.. తన దయనీయపరిస్థితిని చెప్పుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఇక, చేసేది ఏమీ లేక.. బిడ్డ శవాన్ని తన భుజాలపై వేసుకుని కాలినడకనే ఇంటికి బయల్దేరాడు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ఇక, ఆ తండ్రి బాధను గమనించిన కొందరు స్థానికులు.. సహాయం చేసి.. నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని వారి ఇంటికి చేర్చడానికి తోడ్పాటు అందించారు.
అయితే, అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎవరూ స్పందించలేదని మృతుడి తాత మన్సుఖ్ అహిర్వార్ ఆరోపించారు. మనవడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందిని కోరామని, అయితే వారి నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు. ఇక, ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేయడానికి మా వద్ద డబ్బు లేకపోవడంతో మేం.. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, బక్స్‌వాహాకు బస్సు ఎక్కాం.. బక్స్‌వాహా చేరుకున్న తర్వాత, మృతదేహాన్ని పౌడి గ్రామానికి తీసుకెళ్లేందుకు వాహనాన్ని అందించాలని నగర పంచాయతీని కోరామని, అయితే వారు నిరాకరించారని బాలిక తండ్రి లక్ష్మణ్ అహిర్వార్ తెలిపారు. మరోవైపు, డాక్టర్ మమతా తిమోరి ఈ వాదనను ఖండించారు. ఎవరూ నా వద్దకు రాలేదని తెలిపారు.