చార్‌ధామ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన మిగతా ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులు యమునోత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాగా మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారేనని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని అమిత్ షా వివరించారు.
Uttarakhand | A bus carrying 28 pilgrims from Panna district in Madhya Pradesh fell into a gorge near Damta in Uttarkashi district. Bodies of 6 people recovered while 6 injured have been sent to the hospital. Police & SDRF on the spot: DGP Ashok Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 5, 2022