దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ తన సత్తా చాటుకుంది. ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీని మధ్యప్రదేశ్ జట్టు సొంతం చేసుకుంది. 2021-22 సీజన్ రంజీ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ గెలిచి చరిత్రలో తొలిసారిగా రంజీ ట్రోఫీని దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్లో ముంబై జట్టు 269 పరుగులు చేయగా మధ్యప్రదేశ్ ముందు 108 పరుగుల స్వల్ప…
బీజేపీ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్గా పేరున్న మాజీ సీఎం ఉమాభారతి సొంతపార్టీపైనే ఉద్యమాన్ని చేస్తున్నారు.. గత కొంత కాలంగా మద్యపాన నిషేధంపై పోరాటం చేస్తున్న ఆమె… తాజాగా, మధ్యప్రదేశ్లోని నివారీ జిల్లాలోని ఓర్చా పట్టణంలోని ఒక మద్యం షాపుపై ఆవు పేడను విసిరారు, బీజేపీ పాలిత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఉమాభారతి సోషల్ మీడియాలో పంచుకున్నారు.. మద్యం షాపు ఉన్న…
వృత్తి రీత్యా తాము బిజీ అయిపోవడంతో.. తమ బాబును రోజు మొత్తం చూసుకోవడం కోసం ఒక మహిళను నియమించింది ఓ జంట. ఆమె ప్రవర్తన, మాట తీరు చూసి.. తమ బాబుని ఎలాంటి లోటు లేకుండా, ప్రేమానురాగాలతో తల్లిలాగే చూసుకుంటుందని ఆ దంపతులు అనుకున్నారు. కానీ, ఆమెలో ఉన్న రాక్షసిని మొదట్లో గుర్తించలేకపోయారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత ఆమె అసలు బండారం తెలుసుకొని ఖంగుతిన్న ఆ జంట, సాక్ష్యాధారాలతో సహా ఆ మహిళను పోలీసులకు అప్పగించి…
ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. కాటేసేందుకు కామాంధులు కాచుకూర్చున్నారు. మహిళల్ని బలహీనులని భావించి, వారిని లోబరుచుకుంటే ఏం చేయలేరన్న మదంతో రెచ్చిపోతున్నారు. కానీ, తాము తలుచుకుంటే ఎలాంటి వారినైనా మట్టికరిపిస్తామని చెప్పడానికి తాజా ఉదంతం సాక్ష్యంగా నిలిచింది. తమపై అఘాయిత్యానికి పాల్పడేవారిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఓ మహిళ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. తనను రేప్ చేయడానికి వస్తే, ఏమాత్రం జంకకుండా తిరిగి అతనిపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పింది. అది మధ్యప్రదేశ్.. ఓ…
దంపతుల మధ్య చిన్నచిన్న కారణాలే హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. షాపింగ్ కు తీసుకెళ్ల లేదని.. చీర కొనివ్వ లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూశాం. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పదేపదే పనికి వెళ్లు అని భర్తను విసిగించడంతో భార్యను దారుణంగా హత్య చేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ జబల్ పూర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పనికి వెళ్లమని భార్య అడిగినందుకు…
ఓ వైపు దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని గొప్పలు చెప్పుకుంటున్నా.. మరోవైపు, కొన్ని ఘటనలు మనం ఎంత వెనకబడి ఉన్నాం, వైద్యంలో మన పరిస్థితి ఏంటి? కనీస అవసరాల కల్పనలో మనం ఎక్కడున్నాం..? సాటివారిపట్ల మానవత్వం కూడా చూపించలేకపోతున్నామా? లాంటి విషయాలను తేటతెల్ల చేస్తుంటాయి.. తాజాగా, తన నాలుగేళ్ల కుమారుడి శవాన్ని ఓ తండ్రి.. తన భుజాలపైనే మోసుకుంటూ ఇంటికి చేరుకున్న దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు…
చార్ధామ్ యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. గాయపడిన మిగతా ఆరుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు…
ఇటీవల కేరళలో పాచిపోయిన షవర్మా తిని చాలా మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో ఓ బాలిక చనిపోయింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలన కలుగచేసింది. మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫుడ్ ప్రాణాలను మీదికి తెస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్ లో బిర్యాణీ ఆర్డర్ చేస్తే అందులో బల్లి కనిపించడం..వెంటనే గమనించిన కస్టమర్లు వాంతులు చేసుకోవడంతో ప్రమాదం తప్పింది. తాజాగా కల్తీ ఆహారంతో ఎంత ప్రమాదమో తెలిపే మరో ఘటన చోటు చేసుకుంది.…
బండి .. బండి రైలు బండి.. వేళకంటూ రాదులేండి.. దీన్ని గాని నమ్మూకుంటే ఇంతేనండీ.. ఇంతేనండీ.. నితిన్ నటించిన ‘జయం’ సినిమాలోని పాట మీకు గుర్తుందా? దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అందుకే సినిమాల్లో కూడా పాట రూపంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. అయితే ఈ అపవాదను పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి.…
కంటికి కనిపించేవన్నీ నిజం కావు అన్నట్టు.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకొనే ప్రతీ బిచ్చగాడు పేదోడు కాదు. వాళ్ళలో కొందరు బిచ్చం ఎత్తుకునే, ఎంతో డబ్బు సంపాదించి ఉంటారు. కొందరు కోటీశ్వరులుగా అవతరించిన వాళ్ళను సైతం మనం చూశాం. ఇప్పుడు తాజాగా ఓ బిచ్చగాడు తన భార్య కోరిక తీర్చాడు. ఆ కోరిక ఖరీదు పదో పరకో కాదు.. అక్షరాల రూ. 90 వేలు! ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లో సంతోష్ కుమార్ సాహు అనే ఓ…