ఇటీవల కేరళలో పాచిపోయిన షవర్మా తిని చాలా మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో ఓ బాలిక చనిపోయింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలన కలుగచేసింది. మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఫుడ్ ప్రాణాలను మీదికి తెస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్ లో బిర్యాణీ ఆర్డర్ చేస్తే అందులో బల్లి కనిపించడం..వెంటనే గమనించిన కస్టమర్లు వాంతులు చేసుకోవడంతో ప్రమాదం తప్పింది.
తాజాగా కల్తీ ఆహారంతో ఎంత ప్రమాదమో తెలిపే మరో ఘటన చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లో గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతం అయిన సింగర్ పూర్ లోని జాతరలో ‘పానీ పూరి’ తిన్న వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్ జిల్లా మండలా జిల్లాలో పానీపూరి తిని 97 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ… జిల్లా అస్పత్రలో చేరారు.
జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగర్ పూర్ లో ఏర్పాటు చేసిన జాతరలో పిల్లలు శనివారం సాయంత్రం కారంతో కూడి బాగా స్పైసీగా ఉన్న చిరుతిండిని తిన్నారని.. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పిల్లలకు వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డారని..దీనికి ఫుడ్ పాయిజనింగ్ కారణం అని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కేఆర్ శాక్య తెలిపారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. పానీ పూరీ విక్రేతను అదుపులోకి తీసుకుని.. శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపామని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను శనివారం రాత్రి కేంద్ర మంత్రి, మండలా పార్లమెంటు సభ్యుడు ఫగ్గన్‌సింగ్ కులస్తే పరామర్శించారు.