మధ్య ప్రదేశ్ లో శనివారం దారణం చోటు చేసుకుంది. గుణ జిల్లా సాగా బర్ఖేగా అటవీ ప్రాంతంలో కృష్ణజింకలను వేటాడుతున్నరనే పక్కా సమాచారంలో వెళ్లిన ముగ్గురు పోలీస్ అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. రాజధాని భోపాలకు 160 కిలోమీటర్ల దూరంలోని ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ఎస్సై రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు.
ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఏకంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డీజీపీతో పాటు ప్రధాన కార్యదర్శితో సహా గుణ జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నిందితులను విడిచిపెట్టేది లేదని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సర్కార్ ఆదేశాలతో నిందితుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపులు చేపట్టారు. గాలింపుల్లో భాగంగా ఇద్దరు వేటగాళ్లు పోలీస్ కాల్పుల్లో మరణించారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ కుమార్ శర్మ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు తప్పించుకున్నారని.. వారిని కూడా తమ అధికారులు త్వరలోనే అరెస్ట్ చేస్తారని వెల్లడించారు. వేటగాళ్ల కాల్పుల్లో మరణించిన పోలీసుల కుటుంబాలకు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం… వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి