Madhya Pradesh: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు ఎలక్షన్ డ్యూటీ పడుతోంది. అయితే ఇప్పుడు ఓ టీచర్ వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల శిక్షణా తరగతులకు హాజరుకాకపోవడమే కాకుండా, షోకాజ్ నోటీసులు పంపిన అధికారులకు ఖంగుతినే సమాధానం వచ్చింది. ఈ సమాధానం చూసి ఉన్నతాధికారులకు చిర్రెత్తుకొచ్చి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికలకు కొన్ని రోజులే సమయం ఉంది. వచ్చే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి దృష్టి వీటిపై కేంద్రీకృతమయ్యాయి.
INDIA bloc: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 186 (81 శాతం) మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) గురువారం ఓ నివేదికలో తెలిపింది.
Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్గా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక,…
BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Congress Candidate List: కాంగ్రెస్ పార్టీ నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Assembly Election Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక పై క్షణం తీరిక లేకుండా గడిపే సమయం వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎంపీతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు నేడో రోపో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ రెండో వారం నుంచి డిసెంబర్ మొదటివారం మధ్యలో పోలింగ్ జరిగే ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.