PM Modi: “మూర్ఖులకు రాజు”.. రాహుల్ గాంధీ ‘మేడ్ ఇన్ చైనా’ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
బుధవారం భగవాన్ బీర్సాముండా జయంతిని దేశం మొత్తం జరుపుకుంటున్న సందర్భంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం రూ. 24,000 కోట్ల విలువైన పథకాన్ని ప్రారంభించనుందని నరేంద్రమోడీ మంగళవారం తెలిపారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో భాజపా పట్ల అపూర్వమైన విశ్వాసం, ప్రేమానురాగాలు చూశామని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. రేపు జనజాతీయ గౌరవ్ దివాస్, భగవాన్ బిర్సా ముండాకు నివాళులు అర్పించేందుకు రేపు జార్ఖండ్ వెళ్లనున్నట్లు, అక్కడే గిరిజనుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
మోదీ హమీల ముందు కాంగ్రెస్ బూటకపు హామీలు పనికి రావని ఆ పార్టీకి అర్థమైందని, నవంబర్ 17 దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ వాదనలు బట్టబయలవుతున్నాయని, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని, ఇప్పుడు ఆ పార్టీ అదృష్టంపై ఆధారపడుతుందని ఎద్దేవా చేశారు.
Read Also: Israel-Hamas War: గాజాపై పట్టు సాధిస్తున్న ఇజ్రాయిల్.. హమాస్ పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు స్వాధీనం..
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం, రామ మందిర నిర్మాణం నిజమవుతాయని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదని, కానీ వాటిన్నింటిని చేసి చూపించామని మోడీ అన్నారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని, అయితే ప్రజల జేబుల్లో ‘మేడ్ ఇన్ చైనా’ ఫోన్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ లో మేడ్ ఇన్ చైనా ఫోన్లు ఉన్నాయని మహాజ్ఞాని నిన్న అన్నారు.. మూర్ఖుల రాజు ఏ ప్రపంచంలో జీవిస్తున్నారో, తమ దేశ ప్రగతిని చూడలేని రోగం వారికి ఉందని కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల తయారీలో భారతదేశం రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చున్నారు, వారికి బయటకు వెళ్లాలని అనిపించడం లేదని ప్రధాని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రవంలో కాంగ్రెస్ అవినీతి, దోపిడిని అరకట్టడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!