మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.
Tobacco: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పొగాకు ఇవ్వలేదని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని షాహ్‌దోల్ జిల్లాలోని బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు రామ్లా కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్‌లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్‌ను మధ్యప్రదేశ్‌లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.
ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
Ayodhya: అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు వివాహమైన ఐదు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్త సదరు మహిళను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అయితే, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తన భర్త నుంచి విడాకుల కావాలని కోరింది. మహిళ తన విడాకులను భోపాల్ లోని కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసింది.
మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కారును ఓవర్టేక్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదాడు బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(SDM). దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
Heart Attack: ఇటీవల కాలంలో యువకులతో పాటు టీనేజ్‌లో ఉన్న యువకులు కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో క్లాస్ వింటూనే గుండెపోటుతో కూలిపోయాడు ఓ విద్యార్థి.
Namibian cheetah: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో మరో చిరుత మరణించింది. 2022 సెప్టెంబర్ నెలలో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతల్లో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శౌర్య అని పిలువబడే చిరుత మరణించడంతో ఇప్పటి వరకు 7 పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు మరణించాయి. మార్చి 2023లో 3 చిరుత పులి పిల్లలు మరణించాయి.
ఆదివారం రాత్రి పొరుగింటి వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆమె గుట్కా తీసుకుంది. ఇక, ఈ విషయం తెలిసిన భర్త శివకుమార్.. గుట్కా కావాలంటే తనను అడగొచ్చు కదా? అని పూజను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.