Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. రికార్డుల్లోకెక్కిన భారత బౌలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్‌లో కుల్వంత్ ఈ ఘనతను అందుకున్నాడు.
95వ ఓవర్‌లోని 2, 3, 4, 5 బంతులకు కుల్వంత్ కేజ్రోలియా వికెట్స్ పడగొట్టాడు. మధ్యప్రదేశ్ బ్యాటర్లు షెష్వాత్ రావత్, మహేష్ పీతియా, భార్గవ్ భట్, ఆకాశ్ సింగ్‌లను ఔట్ చేశాడు. ఇంతకుముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018)లు రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా.. రంజీల్లో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్‌గా కుల్వంత్ రికార్డుల్లోకెక్కాడు.
Also Read
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
Also Read: Bangladesh Captain: షకీబ్ అల్ హసన్ బిజీ.. బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్!
నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనత అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే సాధించారు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ, వెస్టిండీస్ వెటరన్ పేసర్ ఆండ్రీ రసెల్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనత ఏ భారత బౌలర్‌పై లేదు.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!