Tobacco: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పొగాకు ఇవ్వలేదని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని షాహ్‌దోల్ జిల్లాలోని బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు రామ్లా కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Anand Mahindra: IIT JEE ,UPSC పరీక్షల్లో ఏది కష్టం.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే..?
కోల్ తన అన్నయ్య భార్య సుఖిబాయి(35)ని పొగాకు అడిగాడు. అయితే ఆమె పొగాకు ఇచ్చేందుకు తిరస్కరించింది. ఇంట్లో పొగాకు లేదని చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న కోల్ రాత్రి 11 గంటల సమయంలో మహిళ, ఆమె కొడుకు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో బాలుడు మరణించగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి, ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదైంది.