Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గర్భిణి అని చూడకుండా ముగ్గురు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తించారు. మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై క్రూరంగా అత్యాచారం చేసి, చంపేందుకు నిప్పటించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిల్లో ప్రాణాల కోసం పోరాడుతోందని పోలీసులు శనివారం తెలిపారు. 80 శాతం గాయాలైన మహిళ గ్వాలియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kamal Nath: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కీలక నేతలు చేజారిపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతగా, మధ్యప్రదేశ్ మాజీ సీఎంగా ఉన్న కమల్ నాథ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ సోషల్ మీడియాలో తన బయో నుంచి కాంగ్రెస్‌ని తొలగించడం వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. మరోవైపు ఈ రోజు కమల్…
Kulwant Khejroliya picks 4 wickets in 4 balls: భారత బౌలర్, మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా రికార్డుల్లోకెక్కాడు. రంజీల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా హోల్కర్ స్టేడియం వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో కుల్వంత్ ఈ రికార్డు నెలకొల్పాడు. బరోడా సెకండ్ ఇన్నింగ్స్ 95వ ఓవర్లో కుల్వంత్ ఈ ఘనతను…
PM MODI: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మధ్యప్రదేశ్‌లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్పూర్లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్‌లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
మధ్యప్రదేశ్‌లో ఓ బాలికను ఆలయానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ అత్యాచార ఘటన 2018లో జరిగింది. మైనర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేరం చేసే సమయానికి నిందితుడి వయస్సు 40 ఏళ్లు.
Tobacco: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పొగాకు ఇవ్వలేదని ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని షాహ్‌దోల్ జిల్లాలోని బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. నిందితుడు రామ్లా కోల్(30)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్‌లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్‌ను మధ్యప్రదేశ్‌లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.