Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో డాక్టర్ నర్సుపై కాల్పులు జరిపాడు. నర్సుగా పనిచేస్తున్న మహిళ వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందనే అనుమానంతో డాక్టర్ ఆమెపై కాల్పులు జరిపిన ఘటన బుధవారం జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య దీనిపై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన డాకర్ట సందీప్ సోని(34), 27 ఏళ్ల మహిళా నర్సుపై గన్‌లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. స్థానికేతరుడి కాల్చివేత..
మరోక వ్యక్తితో ఆమె సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఏఎస్పీ ప్రియాంకా శుక్లా వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నర్సు డాక్టర్‌తో రిలేషన్‌లో ఉంది. అయితే, ఆమె తన పాత స్నేహితుడితో సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ సందీప్ సోని, నర్సు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో కంట్రీ మేడ్ రివాల్వర్‌తో ఆమెపై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతోంది. డాక్టర్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.