మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డ లోపల పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్ష తర్వాత వైద్యులు ఈ విషయం తెలుసుకున్నారు. కాగా.. ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్‌చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త…
MP Horror: మధ్యప్రదేశ్ ఉమారియా జిల్లాలో దారుణం జరిగింది. వరకట్నం కోసం 7 నెలల గర్భిణిని ఆమె భర్త, అత్తామామలు దారుణంగా చంపేశారు. శుక్రవారం రోజు ఈ ఘటన జరిగింది. నిందితులు బాధితురాలిని కట్నం కోసం గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఆమె భర్తతో పాటు అత్తామామలు, ఇద్దరు ఆడపడచులపై కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.
మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కారణంగా పలు ఇళ్లు నీటిలో నానిపోయాయి. దీంతో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. బుధవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇద్దరు యువ ఆర్మీ అధికారు విహారయాత్రకు వెళ్లారు. అయితే, నేరస్తులు ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, అందులో ఒక మహిళపై అత్యాచారం చేశారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్ఫాంట్రీ స్కూల్‌లో యంగ్ ఆఫీసర్స్(వైఓ) కోర్సు చదువుతున్న 23, 24 ఏళ్ల అధికారులు తమ గర్ల్ ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ కోసం వెళ్లినప్పుడు ఘటన జరిగినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్…
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది. హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్-కుష్ అని పేరు పెట్టింది. మెహనాజ్ బికి బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది.