Madhya Pradesh: ఘోర ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ట్రక్కు, ఏడుగురి దుర్మరణం
- మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ఆటోను ఢీకొన్న ట్రక్కు
- అనంతరం ఆటోపై బోల్తాపడ్డ ట్రక్కు
- ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి
- మరో ఆరుగురికి తీవ్ర గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మజ్‌గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నుంజ ఖమ్‌హారియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను బలంగా ఢీకొట్టి.. అనంతరం ఆటోపై బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతి చెందారు. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
మృతులు, క్షతగాత్రులందరూ ప్రతాపూర్ వాసులేనని చెబుతున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో బైటాయించి రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రమాదంపై అధికారులు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో… సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Read Also: Dengue: డెంగ్యూ వచ్చిందా?.. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి!
అనంతరం.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు కూలీలను జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!