మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను చంపించాడు. ఈ హత్యలో యువకుడి స్నేహితుడు కూడా అతనికి సహకరించాడు. భార్యను హత్య చేసేందుకు భర్త రూ.2.5 లక్షలకు బేరం కుదుర్చుకుని కళ్ల ముందే భార్యను స్నేహితుడి చేతిలో హత్య చేయించినట్లు సమాచారం.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ సమీపంలోని మోవ్ తహసీల్ సమీపంలోని కోరల్ గ్రామంలో శుక్రవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఫామ్ హౌస్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు చనిపోయారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
Supreme Court: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటా సీట్లలో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అని సుప్రీంకోర్టు తన తీర్పులో…
Road Accident: మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో మంగళవారం అత్యంత బాధాకరమైన ప్రమాదం జరిగింది. బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తున్న భక్తుల ఆటో వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 6 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఛతర్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి బాగేశ్వర్ ధామ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.…
తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. తల్లిదండ్రుల ప్రేమ ముందు సంపద, కీర్తి అన్నీ దిగదుడుపే. అయితే ఈ బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది
Garlic: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి చాలా ప్రముఖం. వంటల్లో వెల్లుల్లిని వాడితే దాని రుచి, సువాసన అమోఘంగా ఉంటుంది. సాధారణంగా దాని ఘాటు వాసన కారణంగా దీనిని వంటల్లో తరుచుగా మసాలాగా పరిగణించబడుతుంది. అయితే, ఈ వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో దశాబ్ధకాలంగా చర్చనీయాంశంగా మారింది. వెల్లుల్లి కూరగాయనా..? లేదా మసాలా..? అనే విషయంపై సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఫుల్స్టాప్ పెట్టింది.
రైలు సామాన్యుడి నేల విమానం. టికెట్ల ధరలు తక్కువగా ఉండటంతో సామాన్యులు ఎక్కువ మంది రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైల్వే ప్రయాణాన్ని చాలా మంది సురక్షితమని భావిస్తారు
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఓ కిరాణం షాపును నడుపతున్నాడు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.