మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్ సభలో అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
మోడీ సర్కార్ పై ప్రతిపక్షాల కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు మూడో రోజు చర్చకు రానుంది. ఎన్డీఏపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడనున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యే ముందు లోక్సభ సెక్రటేరియట్ దాని నోటీసును జారీ చేసింది.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది.
ఇకపై దేశంలోని ప్రతి పౌరుడి పర్సనల్ డాటా సురక్షితంగా ఉండనుంది. పర్సనల్ డేటాను ఎవరైనా వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేసినట్టయితే అటువంటి వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధించనున్నారు.
లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.