ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ (మంగళవారం) లోక్సభలో చర్చ ప్రారంభం కానుంది. లోక్సభలో ఈ చర్చను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడనున్నారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యే ముందు లోక్సభ సెక్రటేరియట్ దాని నోటీసును జారీ చేసింది.
ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లుకు లోక్సభ ఆమోదించింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల వాకౌట్ చేశాయి. విపక్షాల వాకౌట్, నిరసనల మధ్య కేంద్రం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది.
ఇకపై దేశంలోని ప్రతి పౌరుడి పర్సనల్ డాటా సురక్షితంగా ఉండనుంది. పర్సనల్ డేటాను ఎవరైనా వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేసినట్టయితే అటువంటి వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధించనున్నారు.
లోక్సభలో ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. బీఆర్ఎస్ తరఫున చర్చలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
లోక్సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్సభకు రానని స్పష్టం చేశారు.
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది.