కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లక్నో న్యాయవాది అశోక్ పాండే దీనిని దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3)తో చదివిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, 191 ప్రకారం ఒకసారి పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు పదవిని నిలిపివేస్తే అతను అనర్హుడని పిటిషన్‌లో పాండే వాదించారు. ఆయనపై మోపిన అభియోగాల నుంచి హైకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
Read Also: Sharad Pawar: పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. కూటమి సమావేశంలో చర్చిస్తాం
మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించబడి.. 2 సంవత్సరాల జైలు శిక్ష పడిన తర్వాత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయినప్పుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. రాహుల్ కోల్పోయిన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇది సరికాదని పిటిషనర్ వాదించాడు. అంతేకాకుండా.. లోక్‌సభ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు.
Read Also: Minister Taneti Vanitha: కష్టపడి కాదు.. ఇష్టపడి చదవండి.. ఫలితం మీ సొంతం
‘మోడీ ఇంటిపేరు’తో కూడిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 7న లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునురుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ హాజరయ్యారు.