MP Ramesh Bidhuri: రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుండగా.. లోక్సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ రమేష్ బిధూరి బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర ప్రకటన చేశారు.
కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ "నారీ శక్తి వందన్ అధినియం 2023" పేరిట మంగళవారం రోజు సభలో ప్రవేశపెట్టారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల మూడో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కొత్త లోక్సభలో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని రాహుల్ గాంధీ అభివర్ణించారు. లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ బిల్లు అసంపూర్తిగా మారడానికి తన మనసులో ఒక విషయం ఉందన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు.