Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల ఎథిక్స్ కమిటీ మహువా మోయిత్రానను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సూచించింది. లోక్ సభ నిర్ణయంపై ఆమె భవితవ్యం ఆధారపడి ఉంది. వినోద్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ నవంబర్ 9న తృణమూల్ ఎంపీకి వ్యతిరేకంగా నివేదికను ఆమోదించింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఈ నివేదికను సమర్పించింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన అభియోగానలు ఎథిక్స్ ప్యానెల్ లోని ఆరుగురు సభ్యులు సమర్థించగా.. నలుగురు సభ్యులు వ్యతిరేకించారు.
Read Also: Qatar: జర్మనీ అధ్యక్షుడికి అవమానం.. అరగంట వరకు విమానం డోర్ వద్దే పడిగాపులు
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాత్ దూబే ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జై ఆనంత్ దేహద్రాయ్, ఆమె లంచాలు తీసుకున్నట్లు తిరుగులేని సాక్ష్యాలు ఉన్నందున ఆరోపణలు చేస్తున్నట్లు దూబే పేర్కొన్నారు. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని కూడా ఇతరులతో పంచుకున్నట్లు, దుబాయ్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్ మరియు బెంగళూరు నుంచి ఆమె ఐడీని యాక్సెస్ చేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు వ్యాపారవేత్త హీరానందానీ పార్లమెంట్కు సమర్పించిన అఫిడవిట్‌లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ప్రధాని నరేంద్రమోడీ, అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకుంటూ ప్రశ్నలు అడిగినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె అడిగిన దాదాపుగా అన్నీ ఈ వ్యవహారంపైనే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ ఆరోపణల్ని న్యాయవాది దేహద్రాయ్ తనపై వ్యక్తిగత పగతో చేశారని మోయిత్రా ఆరోపించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ముందుగా ఆచితూచి స్పందించిన తృణమూల్, ఇటీవల ఏకంగా సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కావాలనే మహువామోయిత్రాను టార్గెట్ చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమెకే ప్లస్ అవుతాయని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తుందని అన్నారు.