2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు. దీనికి పలువురు నేతలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
Govt Hospital: జగిత్వాలలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషెంట్ ను నేలపై పడుకోబెట్టిన సిబ్బంది..
సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో ఐదుగురు డిప్యూటీ సీఎంలను చేయాలనే ప్రతిపాదనకు హోంమంత్రి జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్ సహా పలువురు నేతలు మద్దతు పలికారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ.. కనీసం ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
Malaika Arora: ఖతర్నాక్ పోజులతో కిర్రాక్ పుట్టిస్తున్న మలైకా అరోరా
మెరుగైన పరిపాలన సాగించేందుకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎంలను నియమిస్తామన్న కేఎన్ రాజన్న ప్రకటనకు తన మద్దతు ఉందని బసవరాజ రాయరెడ్డి అన్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండగా.. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను చేస్తే మొత్తం ఆరుగురు డిప్యూటీ సీఎంలు అవుతారు.
Tragedy: విషాదం.. కొలంబియాలో ఆంధ్రా యువకుడు అనుమానాస్పద మృతి
తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించాలని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న కూడా డిమాండ్ చేశారు. కర్నాటకలోని తుమకూరులో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి పదవి షెడ్యూల్డ్ కుల- తెగకు ఒక పదవి, మైనారిటీ వర్గానికి ఒక పదవి, వీరశైవ సామాజికవర్గానికి చెందిన నాయకునికి ఒక పదవి ఇవ్వాలని ఆయన కోరాడు.