జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సర్టిఫికెట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కోర్టు ఆయనను లోక్సభకు అనర్హులుగా ప్రకటించింది.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి సస్పెన్షన్ను లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ రద్దు చేసింది. బుధవారం కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన తర్వాత సస్పెన్షన్ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్కతాలో అన్నారు.