మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వ (PM Modi) చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జనవరి 31న చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠత (Ayodhya Ram Temple) చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో (Lok Sabha) తీర్మానం ప్రవేశపెట్టింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు నేడు చివరి రోజు.. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై లోక్సభలో చర్చ జరగనుంది. జనవరి 22న జరగనున్న రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంపై చర్చతో 17వ లోక్సభ ఈరోజుతో ముగియనుంది.
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్పే యాప్లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
షెడ్యూల్డ్ తెగలకు చెందిన నకిలీ పత్రాలతో (Fake Caste Certificates) లబ్ధి పొందే అనర్హులపై చర్యలు తీసుకునేలా పార్లమెంటరీ కమిటీ (Parliamentary Panel) కేంద్రానికి సూచించింది.
భారత్లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు తుది తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు.. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది.