Leader Of Opposition: 10 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్సభలో ప్రతిపక్ష నేత వచ్చారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది. సాధారణంగా లోక్సభలోని మొత్తం స్థానాల్లో 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు.
Asaduddin Owaisi: లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు.
లోక్సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి ప్రమోషన్ లభించింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియా కూటమి ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు.
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా సాగాయి. సార్వత్రిక ఎన్నికల్లో తమ అద్భుతమైన ప్రదర్శనతో ఉల్లాసంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు.. 18వ లోక్సభ సభ్యునిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగం కాపీలను ఊపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముందు వరుసలో కూర్చుని నాయకత్వం వహించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ రెండో వరుసలో కూర్చున్నారు.…
18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఎన్నికైన ఎంపీలతో పార్లమెంట్ పరిసరాలు ఉల్లాసంగా కనిపించాయి. ఒకరికొకరు పలకరించుకుంటూ సందడిగా కనిపించింది.
పదేళ్ల తర్వాత లోక్సభలో కాంగ్రెస్ తన ప్రతిపక్ష నేతను నియమించుకోనుంది. అందుకోసమని.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేతగా అభ్యర్థించారు. అయితే.. రాహుల్ గాంధీ తన నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ క్రమంలో.. సోమవారం కాంగ్రెస్ విలేకరుల సమావేశంలో ఒక ఆసక్తికరమైన సంఘటన కనిపించింది. లోక్సభ ప్రతిపక్ష నేతగా అంగీకరించకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను బెదిరించారని రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఈ విషయం…