పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానమిచ్చారు.
పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రారంభమైన రెండ్రోజులు సాఫీగా సాగినా శుక్రవారం మాత్రం హాట్ హాట్గా నడిచాయి. బుధవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సభ ప్రారంభమైంది
మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.
పేపర్ లీకేజీల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు పేరుతో ప్రతిపాదిత చట్టం.. సెంట్రల్ ఏజెన్సీ పోటీ పరీక్షలు, విశ్వవిద్యాలయ పరీక్షలతో సహా వివిధ పరీక్షలలో అన్యాయమైన పద్ధతుల సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.
ప్రస్తుతం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న ఇవే చివరి సమావేశాలు. గురువారమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల వారు చాలా ఆశలు పెట్టుకున్నారు.
గురువారం మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవనున్నారు. మోడీ సర్కార్కు కూడా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చలు చాలా సహృదయపూర్వకంగా జరిగాయన్నారు. ఈ స్వల్పకాలిక సమావేశంలో ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.