Vrushakarma: హాలీవుడ్ రేంజ్‌లో ‘వృషకర్మ’ గ్లింప్స్..అదిరిపోయిన నాగచైతన్య మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ నాగచైతన్య తన కెరీర్‌లో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో దర్శకుడు కార్తీక్ దండు ఒక భయంకరమైన సూపర్ నేచురల్ ప్రపంచాన్ని కళ్లకు కట్టారు.
Also Read : Tollywood: బాలీవుడ్ కోసం టాలీవుడ్ హిట్లను వదులుకుంటున్న భామలు!
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
గ్లింప్స్ ప్రారంభంలోనే ఒక దుష్టశక్తి ఒక డ్రాయింగ్‌ను గీస్తూ ఉండటం, అకస్మాత్తుగా ఆ డ్రాయింగ్ నుంచి ఒక గబ్బిలం ఆకారంలో ఉన్న శక్తి బయటకు వచ్చి ఒక వ్యక్తి తల నుంచి దూసుకుపోతూ అతన్ని చంపేయడం వంటి దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి.. ‘దుష్టశక్తులు మేల్కొన్నప్పుడు.. విధి ఒక ‘వృషకర్మ’ను ఎంచుకుంటుంది’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తోంది. చివర్లో నాగచైతన్య ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో చైతూ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.
ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన హారర్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది. రాహుల్ హెరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర టాంగల ప్రొడక్షన్ డిజైన్ ఈ విజువల్ వండర్‌కు ప్రాణం పోశాయి. స్పర్ష్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో భయంకరంగా కనిపిస్తుండగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి, జయరామ్ కూడా గ్లింప్స్‌లో మెరిశారు. మొత్తానికి ‘వృషకర్మ’ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!