సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ బీజేపీ (AP BJP) సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై బీజేపీ నేతలు చర్చలు ప్రారంభించారు. శని, ఆదివారాల్లో పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది.
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్‌లలో సీట్ షేరింగ్‌కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి.
వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశాం.. తర్వాత లోక్ సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు.
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వ (PM Modi) చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జనవరి 31న చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి.