BSP First List : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
ఇండియా కూటమిలో మరో చీలిక వచ్చేటట్టు కనిపిస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ పార్టీతో ఆర్జేడీ సీట్ల లెక్క ఇంకా తేలలేదు. కానీ సంకీర్ణ ధర్మాన్ని మాత్రం రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ విస్మరించింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ప్రధాన పార్టీలు ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దించాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కటక్ ఎంపీ భర్తృహరి మహతాబ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు పంపించారు.