తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు.
పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 12 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసింది.
హర్యానాలో ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తన కేబినెట్‌ను విస్తరించారు. మంగళవారం తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.
గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్కసీటు కూడా రాదని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి చేరికలు జోరందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీలోకి వలసలు జెట్ స్పీడ్‌గా సాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కమలం గూటికి చేరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి చేరికలు జోరుగా సాగుతున్నాయి.
జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎంలో సొంత కుటుంబం నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడి భార్య, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఆ పార్టీకి గట్టి షాకిచ్చారు.