బాలీవుడ్ నటి, మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గానికి కంగనా చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికారు
ఐటీ శాఖకు బీజేపీ సుమారు 4600 కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపలు గుప్పించింది. ఆ డబ్బును వసూల్ చేసేందుకు బీజేపీకి ఆదాయపు పన్ను శాఖ డిమాండ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.
బీహార్లో మహా కూటమి మధ్య సీట్ల విభజన జరిగింది. ఇందులో ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, వామపక్ష పార్టీలు 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీట్లపై ఒప్పందం కుదిరిందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ సహా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రంలో రైతు సంఘాలన్నీ ఒక్కటవుతున్నాయి. రైతుల బాధలు పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారు భావిస్తున్నారు.
ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED),సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేష్‌న్(CBI) స్వతంత్ర దర్యాప్తు సంస్థలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన పద్మరాజన్ విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు.