K.Kavitha: నేటితో కవిత కస్టడీ పూర్తి.. మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి గత ఆరు రోజులుగా విచారణ జరుపుతున్న కల్వకుంట్ల కవితకు తన అరెస్టు అక్రమమని ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నిబంధనలను పాటించకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను అరెస్టు చేశారని కవిత కోర్టులో సవాల్ చేస్తూ రూస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ నెల 15న అరెస్టయిన కవితను ఈడీ అధికారులు 16న రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో కవిత నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని కోరడంతో ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరిన ఈడీ అధికారులు గత ఆరు రోజులుగా విచారణ జరుపుతున్నారు. ఏడో రోజు (ఈరోజు) విచారణ పూర్తి చేసి మధ్యాహ్నం 12 గంటల లోపు కవితను మళ్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వారం రోజులుగా కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించినట్లు సమాచారం.
Read also: TS Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి పొరపాట్ల సవరణకు ఛాన్స్..!
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
అంతేకాదు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు రూస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇవ్వడంతో కవిత కుటుంబ సభ్యులను కలుస్తోంది. అయితే ఈరోజు కవితను రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్న ఈడీ అధికారులు మళ్లీ కవితను కస్టడీకి కోరే అవకాశం ఉంది. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కవిత బెయిల్ పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పడంతో.. బెయిల్ కోసం కవిత మళ్లీ రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈడీ విచారణ, ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి కేసీఆర్ కవితకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు.
Read also: TS TET 2024: రూ.1000కి చేరిన ‘టెట్’ దరఖాస్తు ఫీజు..! రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు..!
శనివారం ఉదయం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఏడుగురు ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఇక్కడి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఊడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే కవిత కస్టడీలో ఉండగా (ఎమ్మెల్సీ కవిత అరెస్ట్)… బంధువుల ఇళ్లలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. కవిత ఇచ్చిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నాయా…? మరి ఏమైనా తనిఖీలు జరిగాయా అనేది తెలియాల్సి ఉంది.
Pragya Jaiswal : అదిరిపోయే లుక్ లో అఖండ బ్యూటీ స్టిల్స్..
తాజావార్తలు
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!