తమిళనాడులో తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఇక గురువారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తాజాగా శుక్రవారం 14 మందితో కూడిన తమిళనాడుకు చెందిన బీజేపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. విరుదునగర్ నుంచి సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఈ స్థానం ఆసక్తికరంగా మారింది.
అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. తాజాగా విరుదునగర్ నుంచి రాధికను బీజేపీ రంగంలోకి దింపింది. అయితే అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా ఈ స్థానం డీఎండీకేకు దక్కింది. దీంతో ఇక్కడ దివంగత నటుడు, కెప్టెన్ తనయుడు విజయ ప్రభాకరన్ బరిలోకి దిగుతున్నారు. రాధికా పేరు వెల్లడి కాగానే విజయ ప్రభాకరన్ పోటీ చేస్తారని అన్నాడీఎంకే తెలిపింది. పొత్తులో భాగంగా డీఎండీకే ఐదు స్థానాలు దక్కాయి. అందులో విరుదునగర్ ఉంది. ఇక్కడ సమఉజ్జీలు తలపడడంతో ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు.
2006లో రాధిక రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకేలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అదే ఏడాది వారిని తొలగించింది. 2007లో వారు ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించారు. దానికి ఉపాధ్యక్ష హోదాలో ఆమె సేవలు అందించారు. కొద్దిరోజుల క్రితం ఏఐఎస్‌ఎంకేను బీజేపీలో విలీనం చేశారు. ఈ క్రమంలో రాధికకు కమలం పార్టీ టికెట్ దక్కింది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడైన విజయకాంత్ గత ఏడాది డిసెంబర్‌లో మృతి చెందారు. ఆయన తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు.. రాధికపై పోటీ చేస్తు్న్నారు. మరీ విజయం ఎవర్నీ వరిస్తుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతంది. తొలి ఫేజ్‌లోనే తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఇక చివరి విడత జూన్ 1న జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: RC16: దింపు బుచ్చి మావా.. టాలెంటెడ్ హీరోలందరిని దింపు.. ఇండస్ట్రీ షేక్ ఆడాలంతే..?