మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మంచి అలవాట్లు ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు మనిషిని నాశనం చేస్తాయి. అలాంటి అలవాట్ల కారణంగా మనకు మనమే నాశనం అయిపోతాం. ఒకవేళ ఆ అలవాట్లు మీకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు గుణపాఠం నేర్పించడం ఖాయం. అవి ఏంటంటే… వాయిదా వేయడం, ఫిర్యాదు చేయడం, అతిగా ఆలోచించడం, పోల్చుకోవడం, సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం.
✪ వాయిదా వేయడం: ఏవేవో చేయాలనుకుంటాం. జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ వాటిని రేపు, ఎల్లుండి, వారం, సంవత్సరం అంటూ వాయిదా వేసుకుంటూ ఉంటాం. పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక ఆ పని చేసి ఎలాంటి ఉపయోగం ఉండదు.
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
✪ ఫిర్యాదు చేయడం: ఇదో దరిద్రపు అలవాటు. మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎదుటి వారి మీదనో, ఇంకేదో మీదనో ఫిర్యాదు చేస్తాం. ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు. పర్‌ఫెక్టుగా ఉండే మనిషి పుట్టలేదు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉండటమో, తప్పు చేయడమో జరిగి తీరుతుంది. మనలోని ఏదైతే లోపమో, అవలక్షణమో, అసమర్థతో ఉంటే అది బయటి వాళ్ల మీద ఫిర్యాదులా మారుస్తాం
.✪ అతిగా ఆలోచించడం: కొందరు కొన్ని విషయాలకు అతిగా ఆలోచిస్తుంటారు. కొంచెం ఆలోచించమంటే భూతద్దం పెట్టి మరీ ఆలోచిస్తుంటారు. ఆలోచించే విషయం ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచన చేస్తారో కూడా బొత్తిగా అర్థం కాదు. ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని ఉండేవాళ్ళు. ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే. కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు.
✪ పోల్చుకోవడం: ఇదో పనికిమాలిన అలవాటు. మనకు మనం ప్రతి విషయానికి ఇతరులతో పోల్చి చూసుకుంటాం. వాడు అంత సంపాదించాడు… ఆమె అన్ని నగలు కొనుగోలు చేసింది. వాడు అది కొనుక్కునాడు అంటూ పోల్చుకుని చూడందే మనకు పొద్దు గడవదు. సూది చేసే పని గునపం చేయలేదని… గునపం చేసే పని సూది చేయలేదని అందరూ గుర్తించి తీరాలి. దేని ప్రత్యేకత దానిదే. మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు. గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు. టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వేరు, విమానం నడిపే వాని ప్రత్యేకత వేరు. కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకుని బాధపడుతూ కూర్చోమాకండి. ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం. అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే.
✪ సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం: మనం ఏ పనిచేసినా సేఫ్‌గా పనిచేయాలని… రిస్క్ తీసుకోకూడదని భావిస్తూ ఉంటాం. భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు ఉంటే సేఫ్‌గా ఉంటామనో, ఇన్ని ఆస్తులు ఉంటే సేఫ్‌గా ఉంటామనో…లేకపోతే ఫలానా జాగాలో ఉంటే సేఫ్‌గా ఉంటామనో అనుకుంటుంటే… ముందు మీరు నిద్రలో నుంచి మేల్కొవాలి. సేఫ్ జోన్‌లో ఉండి నేర్చుకునేది ఏమీ ఉండదు.యుద్ధం చేసే వాడు గెలుస్తాడు. ఆడే వాడు గెలుస్తాడు. సేఫ్‌గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఎలాంటి పాఠాన్నీ నేర్చుకోలేడు.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!