Health: ప్రతిరోజూ ఎంతసేపు వాకింగ్ చేయాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు అయితే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వాకింగ్ పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
వాకింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా వాకింగ్ చేస్తే జనసంచారం ఎక్కువగా ఉండటంతో విషవాయువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఆరోగ్యం సంగతి అటుంచితే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరంలో డి విటమిన్ తక్కువగా ఉండేవారు ఉదయం 8 గంటల లోపు ఎండలో నిలబడాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ఉదయం కుదరని వారు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండలో నిలబడొచ్చు. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం వాకింగ్ చేస్తారు. రోజూ నిర్ధారిత సమయంలో నడవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు… అంటే సుమారు 2.5 గంటలు వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. నడవమన్నారు కదా అని బద్దకంగా అడుగులు వేయకండి. వీలైనంత చురుగ్గా శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. వాకింగ్ ప్రతిరోజూ చేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. వర్షాల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బయట వాకింగ్ చేయడం కుదరకపోతే.. ఇంట్లోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి.
Also Read
- Tags
- Fitness
- Health
- life style
- walking
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!