కొంతమంది పగలు మొత్తం విపరీతంగా పనిచేసి రాత్రిళ్లు ఫుల్లుగా తినేస్తుంటారు. కానీ రాత్రిళ్లు ఎక్కువ మొత్తంలో తినడం మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ కొన్నిరకాల ఆహారాలు అసలు తినకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
✪ బీట్‌రూట్: బీట్‌రూట్ చాలా పోషకాలున్న వెజిటేబుల్. కానీ రాత్రి వేళ దీన్ని తినడం మంచిది కాదు. ఎందుకంటే రాత్రిపూట బీట్‌రూట్ తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి.
✪ మాంసాహారం: రాత్రి పూట పొట్ట నిండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకుంటే పొట్ట రావడం ఖాయం. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం కావు, కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. మీకు అంతగా మాంసాహారం తినాలనిపిస్తే రాత్రి ఏడు గంటలకే తినేయండి. రాత్రి పది వరకు నిద్రపోవద్దు. మధ్యలో ఓ అరగంట వాకింగ్ కూడా చేయండి.
✪ ఆరెంజ్ జ్యూస్: సాధారణంగా రాత్రిపూట సిట్రిక్ ఆమ్లాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను నివారించడం వల్ల మీ ప్రేగు కదలికలకు మంచిది. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్‌లో పండు కంటే ఎక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని రాత్రిపూట తాగడం మానుకోవడం మంచిది. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
✪ టీ, కాఫీలు: కొందరికి టీ, కాఫీలు ఎప్పుడు తాగాలో కూడా తెలియదు. ప్రతి మూడు, నాలుగ్గంటలకోసారి కాఫీ, టీలు తాగేస్తుంటారు. ఏముంది గుక్కెడు టీ నీళ్లేగా అంటుంటారు. కానీ ఆ గుక్కెడే బరువు పెరగడానికి సహాయపడతాయి. టీ, కాఫీలలో కెలోరీలు, కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని రాత్రి పూట తాగడం వల్ల ఆ కెలోరీలన్నీ శరీరంలో చేరతాయి. అంతేకాదు కెఫిన్ వల్ల నిద్ర సరిగా పట్టక బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు సాయంత్రం నాలుగ్గంటల తరువాత తాగక పోవడం ఉత్తమం.
✪ మామిడి: మామిడి పండ్లలో పోషకాలు, ప్రొటీన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. కానీ మీరు రాత్రిపూట మామిడి పండు తిన్నప్పుడు అందులోని ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను ఎక్కువసేపు పని చేయిస్తుంది. ఇది మీ నిద్రను ప్రభావితం చేస్తుంది.
✪ క్యాబేజీ, కాలీ ఫ్లవర్: వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. తిన్నా కూడా త్వరగా జీర్ణం కావు. కాబట్టి ఈ కూరలు మధ్యాహ్నం పూటే వండుకోవాలి. రాత్రి పూట తింటే జీర్ణక్రియకు ఆటంకం కలగడం ఖాయం. ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారిపోతుంది. కనుక త్వరగా బరువు పెరిగిపోతారు.
✪ ఆల్కహాల్: రాత్రయితే చాలు సిట్టింగ్ పేరుతో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ. రాత్రి తాగేవారందరికీ అధికంగా పెరుగుతుంది. రాత్రిపూట మద్యం తీసుకోవడాన్ని దూరం పెట్టాలి.