తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా… ఆరింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ ధాటికి ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయిందనే చెప్పాలి. అయితే మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి 230 కంటే తక్కువ ఓట్లు వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో సవాల్ చేశారు. ఈరోజు జరిగిన…
తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకేసారి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే వెసులుబాటును కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అలాగే బస్సును ముందుగానే బుక్ చేసుకుంటే గురుస్వామితోపాటు మరో ఆరుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు. ప్రత్యేక బస్సులు, ఇతర వివరాల…
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…
తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలను బుధవారం ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది రద్దయిన ఫస్టియర్ పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలను రేపు విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. థియరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3…
గవర్నమెంట్ ఆఫీసర్ అంటే వాళ్లకు ఎన్ని సదుపాయాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మంచి క్యాడర్ ఉన్న అధికారులకు కారులో వెళ్లే సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే తమిళనాడులో ఓ కలెక్టర్ మాత్రం చాలా సింప్లిసిటీతో ఉంటున్నారు. వారంలో ఒకరోజు ఇంటి దగ్గర నుంచి రెండు కిలోమీటర్లు నడిచి కార్యాలయానికి వెళ్తున్నారు. అయితే ఆమె నిర్ణయం వెనుక ఓ మంచి ఉద్దేశం ఉంది. వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన రమణ సరస్వతి కెమికల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. అయితే ‘పుష్ప’లో మాత్రం ఇంటర్వెల్‌కు ముందే సమంత ‘ఊ అంటావా మావా..’ అంటూ తన ఐటమ్ సాంగ్‌తో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని.. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని…
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి. Read…
✍ ఢిల్లీ: నేడు 12వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు✍ యూపీ: నేడు వారణాసిలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన… నేడు సుపరిపాలన అంశంపై సెమీనార్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ✍ ఈరోజు సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం✍ తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్.. ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం✍ తిరుపతి: నేటితో ముగియనున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర… ఈరోజు సాయంత్రం…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. ఏపీలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆదాయం సృష్టించే మార్గాలను మరిచి రుణాలపైనే ఆధారపడుతోందని ఆయన…
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించిన ఇద్దరు యువకుల చేత నేలపై ఉమ్మిని నాకించిన ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని సింఘనా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పంచాయతీ ఎన్నికల్లో సింఘానా గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న బల్వంత్ సింగ్ అనే వ్యక్తి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించాడు. అయితే ఇద్దరు యువకులు మాత్రం బల్వంత్ సింగ్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. దీంతో బల్వంత్ సింగ్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. Read Also:…