ఆరోగ్యశ్రీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు.
Read Also: కలెక్టర్ సింప్లిసిటీ… రెండు కి.మీ. నడిచి ఆఫీస్‌కు వెళ్తున్న కలెక్టర్
Also Read
మరోవైపు ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తికి ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇవ్వనుంది. వారికి సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!