ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదలైంది. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప ది రైజ్ చివర్లో సెకండ్ పార్ట్ మూవీ పేరును దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప-ద రూల్’ టైటిల్ పెట్టాడు. పుష్ప ది రైజ్‌తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ.. సెకండ్ పార్టులో తన రూలింగ్‌తో మరింత పీక్స్‌కు తీసుకువెళ్లనున్నాడు.
Read Also: మూవీ రివ్యూ: పుష్ప
పుష్ప మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
★ పుష్ప మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం తూ.గో. జిల్లాలోని మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
★ సినిమా యూనిట్ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
★ తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్, ఫైబర్ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు.
★ ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.