ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం నాడు వైద్యశాఖ అధికారులతో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్…
జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్లు జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం చిన్నారులు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. వీళ్లు తప్పనిసరిగా…
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రమాదాలు, క్రైమ్ వంటి అంశాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్‌లో వివరించారు. గత ఏడాదితో పోలిస్తే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఈ ఏడాది ఓవరాల్‌గా క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందన్నారు. మహిళలపై దాడులు 2 శాతం పెరిగాయన్నారు. ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో 18 శాతం రోడ్డుప్రమాదాలు పెరిగాయని… 712 ఘోర రోడ్డుప్రమాదాలు జరిగాయని వివరించారు. 712 ప్రమాదాల్లో 380 హిట్…
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది దేశంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కావడంతో ఎన్నికలు వాయిదా పడతాయని అందరూ భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం చర్చించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ…
క్రికెట్ ఏ జట్టు అయినా టెస్టు ఫార్మాట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అందుకే టెస్టుల్లో అన్ని జట్లు రాణించాలని తాపత్రయపడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టుకు టెస్టుల్లో పెద్దగా కలిసిరాలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్ ఉన్నా ఆ జట్టు చతికిలపడింది. దీంతో ఇంగ్లండ్ టెస్ట్ టీం అత్యంత గడ్డుకాలంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 2021లో జరిగిన టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు చెత్త రికార్డును నమోదు చేసింది. Read Also: IND Vs SA:…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కరోనా మందు పంపిణీ చేసే ఆనందయ్యకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే… ఒమిక్రాన్ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. కరోనా మందు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరావడం వల్ల తమకు కరోనా సోకుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కరోనా మందు పంపిణీని అడ్డుకున్నారు. Read Also: గోవాలో రెచ్చిపోయిన సమంత..…
తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం నాడు వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయమన్నారు. అయితే తన తమ్ముడితో…
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలను అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కావాలంటే సీఆర్‌పీసీ 144 సెక్షన్‌లోని నిబంధనలను రాష్ట్రాలు ఉపయోగించవచ్చని సూచించింది. Read Also: రాజన్న…
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీలోని జగన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను సోమవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తమ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 53, జీవో నంబర్ 54ను ప్రభుత్వం జారీ చేసింది. Read Also: ఏపీ సర్కార్‌తో చర్చల దిశగా…
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం సృష్టిస్తున్నాడు. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 90 ఓవర్లలో 272 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటాడు. 122 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా ఆజింక్యా రహానె 40 పరుగులతో క్రీజులో నిలబడ్డాడు. అయితే రెండో రోజు తొలి సెషన్ మొత్తం వరుణుడి వల్ల…