నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కరోనా మందు పంపిణీ చేసే ఆనందయ్యకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే… ఒమిక్రాన్ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. కరోనా మందు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలిరావడం వల్ల తమకు కరోనా సోకుతుందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో కరోనా మందు పంపిణీని అడ్డుకున్నారు.
Read Also: గోవాలో రెచ్చిపోయిన సమంత.. బికినీలో సెగలు రేపుతూ
మరోవైపు ఒమిక్రాన్‌పై మందు కనిపెట్టినట్లు ఆనందయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని కృష్ణపట్నం గ్రామస్తులు మండిపడ్డారు. వెంటనే ఆనందయ్య మందు పంపిణీ వెంటనే నిలిపివేయాలని వారు హెచ్చరించారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దారు. కాగా ఉచితంగా మందు పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆనందయ్య స్పష్టం చేశారు. రెండు మందులకు కోర్టు అనుమతి ఇచ్చిందని… మందు పంపిణీలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు