Home
Latest Telugu News
Latest Telugu News News
-
మేం అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్: సోము వీర్రాజు
ఏపీలో వైసీపీ సర్కారుపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అన్నవాళ్లు సారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు . మద్యం రేట్లు పెంచి సామాన్యులను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని సోము వీర్రాజు మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ.70కే చీప్ లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ బాగుంటే రూ.50కే చీప్ లిక్కర్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము… -
అక్కడ నన్ను పడుకోమన్నారు.. యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ యాంకర్ లాస్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో తనకు వికృత అనుభవం ఎదురైందని.. ఓ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన తనను ఓ వ్యక్తి తనతో పడుకోమని అడిగాడని ఆరోపించింది. చాలా ఉన్నతమైన స్థాయిలో న్యూ జెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చాలా పచ్చిగా అడిగాడని.. కానీ తాను కుదరదు అని చెప్పేశానని లాస్య తెలిపింది. ‘నాతో పెద్దపెద్ద యాంకర్లే పడుకున్నారు.. నువ్వెంత?’ అంటూ ఆ వ్యక్తి… -
విజృంభించిన భారత బౌలర్లు.. దక్షిణాఫ్రికా 197 ఆలౌట్
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీల జట్టు 197 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును బవుమా కాపాడాడు. బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. బవుమా (52), డికాక్ (34) రాణించారు. బౌలర్ రబాడ బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ చివర్లో అతడు 25 పరుగులు చేశాడు. Read Also: తొలి ఇన్నింగ్స్‌లో 327… -
బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు… రూ.15 లక్షలు అవినీతి తప్పు కాదు
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలోని రేవాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ… లంచం ఎంత తీసుకోవచ్చు… ఎంత తీసుకోకూడదో మాట్లాడారు. ‘మీ గ్రామ సర్పంచ్ రూ.15 లక్షలు గానీ.. అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే నా వద్దకు రండి. అంతకు తక్కువగా ఉంటే దాని గురించి నాకు చెప్పొద్దు…మీరు కూడా పట్టించుకోవద్దు రూ.15 లక్షలలోపు అవినీతికి పాల్పడితే అతడిని వదిలేయండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎందుకు… -
అమరావతిలోనే బీజేపీ ఆఫీస్.. స్పష్టం చేసిన సోము వీర్రాజు
విజయవాడలో జరుగుతున్న బీజేపీ ప్రజాగ్రహ సభలో ఏపీ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. కేంద్రం డబ్బిస్తే గ్రామ సచివాలయాలు కట్టి స్తోత్రం.. స్తోత్రం అంటూ జగనన్న జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని.. మంత్రి పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రజాగ్రహ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని.. ఈ సభ ద్వారా… -
ఏపీలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు.. 36వేల మందికి పైగా ఉపాధి
ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ముందడుగు వేసింది. ఫార్మాస్యూటికల్ రంగంలో అతిపెద్దదైన సన్‌ఫార్మా ఏపీలో తయారీ ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఛైర్మన్ దిలీప్ షాంఘ్వి మంగళవారం నాడు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై సీఎం జగన్‌తో ఎండీ దిలీప్ విస్తృతంగా చర్చలు జరిపారు. Read Also: హిందూపురంలో బాలయ్య… -
రోహిత్ స్థానంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు. Read… -
హిందూపురంలో బాలయ్య ఇంటి వద్ద ‘డంపింగ్’ వార్
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.… -
ఈ సారి నాంపల్లి ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఉత్కంఠ
ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్ (నూమాయిష్) ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్… -
తీపికబురు అందించిన ఏపీ ప్రభుత్వం.. వారి ఖాతాల్లోకి త్వరలోనే రూ.703 కోట్లు
సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హులుగా ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధి పొందని వారికి జగన్ సర్కారు తీపికబురు అందించింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది అకౌంట్లలో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. Read Also: రాజమండ్రికి కేంద్రం న్యూ ఇయర్ కానుక.. ఓఆర్‌ఆర్ మంజూరు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి…
తాజావార్తలు
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!