ఏపీలో ఒమిక్రాన్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం నాడు వైద్యశాఖ అధికారులతో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అదే సమయానికి కొత్త నియామకాలు కూడా పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే ఖాతాల్లోకి సొమ్ము
ప్రస్తుతం ఏపీలో ఆరు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు ఈ సమావేశంలో సీఎం జగన్‌కు వివరించారు. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు .ఈ సందర్భంగా ఒమిక్రాన్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పరిశీలన పటిష్టంగా కొనసాగాలన్నారు. టెస్ట్ ఎర్లీ, ట్రేస్‌ఎర్లీ, ట్రీట్ ఎర్లీ పద్ధతులలో పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. పర్యాటకులకు రెగ్యులర్‌గా పరీక్షలు జరపాలన్న సీఎం జగన్.. పాజిటివ్ అని తేలితే ప్రైమరీ కాంటాక్టులను కూడా వెంటనే ట్రెసింగ్ చేయాలన్నారు. అటు ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎంకు అధికారులు వివరించారు .13 జిల్లాలలో 98.96 శాతం మొదటి డోస్, 71.76 శాతం సెకండ్ డోస్ పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.