క్రికెట్‌లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో…
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విలువ 25-30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువకు సవరించిన విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉండనున్నట్లు సమాచారం. Read Also: నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు మరోవైపు…
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్…
ఏపీలో జిల్లాల విభజనపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురంధేశ్వరి స్వాగతించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే అందులో 99 సుద్ద తప్పులు ఉన్నాయని… ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి…
ఆర్టీసీ ప్రయాణీలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్…
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెంలో రెవెన్యూ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రేవళ్ల చెరువులో 10 ఎకరాల భూబి ఆక్రమణకు గురైన విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్ ఆక్రమణకు గురైన భూమిని పరిశీలించారు. వెంటనే జేసీబీలతో వెళ్లి ఆక్రమణలను తొలిగించే ప్రయత్నం చేశారు. దీనిపై ఆగ్రహించిన వైసీపీ నేతలు పెందుర్తి ఆర్ఐ శివ కుమార్, గ్రామ సచివాలయ కార్యదర్శి వెంకటేష్‌పై దాడికి…
ప్రీపెయిడ్ పేరుతో 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న టెలికాం సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు గతంలో లాగా 30 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్లు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో…
కరోనా బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కార్యక్రమం మొదలుపెట్టింది. కోవిడ్ బాధితులు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కరోనాకు వైద్యం సాయం పొందేలా ఏర్పాట్లు చేసింది. దీని కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేకంగా ఒక నంబరును కేటాయించింది. కరోనాకు టెలీమెడిసిన్ సాయం కావాలనుకునే వారు 8801033323 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వొచ్చని ఎన్టీఆర్ ట్రస్ట్ సూచించింది. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వారి మొబైల్ ఫోన్‌కు టెలిమెడిసిన్ సేవలు అందించించే జూమ్ కాల్…
✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి స్వల్పంగా కోలుకున్నారు. కానీ ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. దీంతో లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. Read Also: మెగాస్టార్ చిరంజీవికి…