మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా బంగారం కొంటుంటారు. కొందరు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. Read Also: శుభవార్త.. భారీగా…
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పులో కాలేశారు. టంగ్ స్లిప్ కావడంతో సీఎం జగన్‌కు బదులు మాజీ సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ… కరోనా కట్టడికి సీఎం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు, సచివాలయాల కాన్సెప్ట్‌ల ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టే కోవిడ్ నివారణ చర్యలను తీసుకెళ్లే అద్భుతమైన యంత్రాంగాన్ని మనం…
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల…
కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. Read Also: యువకుడికి సైబర్ నేరగాళ్ళ షాక్.. ఏం జరిగిందంటే? వివరాల్లోకి వెళ్తే… భద్రాచలానికి చెందిన డి.అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో…
✪ ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు… ఈనెల 30 వరకు కొనసాగనున్న ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు✪ ఏపీలో స్కూళ్ల నిర్వహణపై నేడు అధికారుల కీలక సమావేశం… పాఠశాలల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమం… బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై నిర్ణయం✪ ఉద్యోగ సంఘాలతో నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు✪ నేటి నుంచి కార్వీ ఎండీ పార్థసారథిని…
బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గయాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గయాలో ఓ రైలుకు ఆందోళనకారులు నిప్పు అంటించారు. సీబీటీ 2 పరీక్ష తేదీని నోటిఫై చేయలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 2019లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీటీ 2 పరీక్షను…
ప్రపంచ వ్యాప్తంగా గత పదేళ్లలో అవినీతి నిర్మూలనలో పెద్దగా మార్పు కనిపించలేదని ‘ట్రాన్స్‌పరెన్నీ ఇంటర్నేషనల్’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. కరోనా కట్టడి చర్యల కారణంగా గత రెండేళ్లుగా అవినీతి నియంత్రణ చర్యలకు ఆటంకం కలుగుతోందని సదరు సంస్థ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అవినీతి రహిత (అవినీతి లేకపోవడం) దేశాల ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 85వ ర్యాంకులో నిలిచింది. దాయాది దేశం పాకిస్థాన్‌లో భారత్‌లో కంటే ఎక్కువ అవినీతి ఉందని సర్వే…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్‌లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా: ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు,…
హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు అర్హమ్ ఖాన్, మహేందర్‌రెడ్డి, శంకర్ గౌడ్, ఏవీ రత్నం, షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వేచ్ఛాయుత…
భారత్‌లో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు అంటే 8 ఏళ్ల కాలంలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు బ్రూక్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. గాడిదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిన మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు వివరాలను సేకరించారు. దేశంలో అక్షరాస్యత రేటు పెరగడం, బరువు మోయడానికి గాడిదలను వాడే ఇటుక పరిశ్రమలలో యంత్రాలు అందుబాటులోకి…