ఆర్టీసీ ప్రయాణీలకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త అందించారు. హైదరాబాద్ నగరంలోని సీబీఎస్ నుంచి మహత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఉచితంగా ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు అందుబాటులో ఉంటాయని… ప్రయాణికులు ఈ వాహనాలలో ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన సూచించారు.
Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్
సీబీఎస్ నుంచి ఎంజీబీఎస్ లోపలకు వెళ్లేందుకు నిత్యం ప్రయాణికులు నరకయాతన పడుతుంటారు. ఎక్కువ రద్దీ ఉండటంతో పాటు రోడ్డు దాటడం వంటివి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రానిక్ వాహనాల ఫ్రీ సర్వీస్‌ను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనంలో మొత్తం 12 మంది ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ ఉచిత సర్వీసులలో మొదటి ప్రాధాన్యత వృద్ధులు, వికలాంగలు, గర్భిణులు, రోగులకు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.