✪ తిరుమల: నేడు ఫిబ్రవరి నెల శ్రీవారి ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల… రోజుకు 12వేల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. రేపు సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ
✪ విశాఖ: నేడు ఎన్టీఆర్ భవన్‌లో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం… ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు.. సమ్మెను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించనున్న కార్మిక సంఘాలు
✪ అమరావతి: ఈరోజు ఆర్టీసీలోని అన్ని ఉద్యోగ సంఘాల కీలక భేటీ… ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ పేరుతో సమావేశం.. పాల్గొననున్న పీఆర్సీ సాధన సమితి, ముఖ్య నేతలు
✪ ప.గో.: నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురంను ప్రకటించాలంటూ నేడు బంద్‌కు పిలుపునిచ్చిన అఖిలపక్షం
✪ వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటన… ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించనున్న ఈటెల రాజేందర్
✪ ఢిల్లీ: ఈరోజు ఉ.10:45 గంటలకు సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం..
✪ నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లు.. తొలి సెమీస్‌లో తలపడనున్న నాదల్, బెర్టిని.. రెండో సెమీస్‌లో తలపడనున్న సిట్సిపాస్, మెద్వదేవ్