PM Modi : అదో పరాన్నజీవి పార్టీ.. కాంగ్రెస్‌పై మోడీ సంచలన వ్యాఖ్యలు
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం
- యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు
- ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు
- హాజరై ప్రసంగించిన మోడీ
- కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం, యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. మహారాష్ట్రలో ఓట్లు పొందేందుకు వీర్ సావర్కర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ తాత్కాలికంగా నిలిపివేసిందని ప్రధాని పేర్కొన్నారు. “కాంగ్రెస్ ఇప్పుడు భారత రాజకీయాల్లో పరాన్నజీవిగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. యూపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు.” అని ప్రధాని తెలిపారు. ‘ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం (ఏక్ హై తో సేఫ్ హై..)’ అనే నినాదమే ఇప్పుడు దేశానికి మహా మంత్రంగా మారిందని చెప్పారు.
కాంగ్రెస్ పరాన్నజీవి..
కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారిందని మోడీ తెలిపారు. “తన పడవను మాత్రమే కాకుండా తన సహచరులను కూడా ముంచుతోంది. మహారాష్ట్రలో కూడా ఇదే చూశాం. అక్కడ కాంగ్రెస్, దాని కూటమిలోని పార్టీలు ప్రతి ఐదు సీట్లలో నాలుగు ఓడిపోయాయి. కాంగ్రెస్ మునిగిపోతూ.. ఇతరులను కూడా ముంచుతుందని దీన్నిబట్టి తెలుస్తోంది. అధిక స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ తన మిత్రపక్షాలను కూడా దెబ్బతీసింది. యూపీ వంటి రాష్ట్రాల్లోని కాంగ్రెస్ మిత్రపక్షాలు కాంగ్రెస్‌ను రక్షించడం విశేషం.
Also Read
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
కాంగ్రెస్ అర్బన్ నక్సలిజం దేశానికి సవాల్
కాంగ్రెస్ అర్బన్ నక్సలిజం దేశానికి సవాల్‌గా మారిందని, దాని రిమోట్ కంట్రోల్ దేశం వెలుపల ఉందని విమర్శించారు. అధికారం కోసం దురాశతో కులతత్వం అనే విషాన్ని వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో అస్థిరతను సృష్టించేందుకు యత్నించిన, ద్రోహానికి పాల్పడిన కొందరిని ఓటర్లే శిక్షించారని ప్రధాని అన్నారు. దేశానికి ప్రథమస్థానం ఇచ్చేవారితోనే తప్ప కుర్చీకి ప్రాధాన్యం ఇచ్చేవారితో ఓటర్లు ఉండరని వ్యాఖ్యానించారు.
సెక్యులరిజం పేరుతో నాశనం…
మన రాజ్యాంగ నిర్మాతలు హిందూ విలువలు, సంప్రదాయాలను పాటిస్తూనే సెక్యులరిజం మార్గాన్ని ఎంచుకున్నారని ప్రధాని మోడీ అన్నారు. అందుకే దేశంలోని మహానుభావులు రాజ్యాంగ పరిషత్‌లో చర్చించారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఆ గొప్ప సంప్రదాయాన్ని తప్పుడు సెక్యులరిజం పేరుతో నాశనం చేసిందన్నారు. కాంగ్రెస్ వేసిన బుజ్జగింపుల బీజం రాజ్యాంగ నిర్మాతలకు చేసిన పెద్ద ద్రోహమని నొక్కి చెప్పారు.
‘వెళ్లేటప్పుడు ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించారు’
దశాబ్దాలుగా కాంగ్రెస్ ఇదే గేమ్ ఆడిందని ప్రధాని మోడీ అన్నారు. బుజ్జగింపు కోసం చట్టాలు చేసిందని.. సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్నారు. దీనికి ఉదాహరణ వక్ఫ్ బోర్డు అని తెలిపారు. 2014 లో, ప్రభుత్వం నుంచి వైదొలగే ముందు.. కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ఉన్న అనేక ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించారని ఆరోపించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు అందించిన వక్ఫ్ చట్టానికి రాజ్యాంగంలో స్థానం లేదని.. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు కోసం వక్ఫ్ బోర్డు వంటి వ్యవస్థను సృష్టించిందన్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు కులానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు..
కాంగ్రెస్ రాజకుటుంబం అధికార దాహం ఎంతగా పెరిగిపోయిందంటే సామాజిక న్యాయ స్ఫూర్తిని కూడా ఛిన్నాభిన్నం చేశాయని ప్రధాని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకులు కులానికి వ్యతిరేకంగా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేవారన్నారు. కానీ నేడు అదే కాంగ్రెస్, దాని కుటుంబం తమ అధికార ఆకలిని తీర్చుకోవడానికి కులం అనే విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ఇంతమంది సామాజిక న్యాయాన్ని గొంతు నొక్కారని.. ఒక కుటుంబానికి అధికార దాహం ఎంతగా ఉందో కాంగ్రెస్‌ను చూస్తే అర్థమవుతుందన్నారు.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!