ఐరోపా దేశమైన నార్వేలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. నార్వేలోని ఓ గ్రామంలో వైద్యుడు 87 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును నార్వే చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కుంభకోణంగా అభివర్ణిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఇలాంటి ఈ మహిళలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. 55 ఏళ్ల నిందితుడి పేరు ఆర్నే బై. 87 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లు ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో ఇద్దరు మైనర్లు బాలికలు ఉన్నట్లు తెలిసింది. ‘ది సన్’ ప్రకారం.. 67 వయసు వృద్ధురాలి నుంచి14 సంవత్సరాలు బాలిక వరకు ఎవ్వర్నీ వదల్లేదు.. అయితే తాజాగా గొంతు నొప్పి కోసం నిందితుడి క్లినిక్‌ని సందర్శించిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ప్రైవేట్ పార్టులో బాటిల్ చొప్పించాడని మహిళ ఆరోపించింది. నొప్పితో తాను చనిపోయేదానిని అని ఆమె వాపోయింది. ఆ మహిళ తనపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లింది. దీంతో ఈ కీచక వైద్యుడి బుద్ది బయటపడింది.
READ MORE: Heart Attack: చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..
నిందితుడు ఆర్నే బై ఇప్పటికే మూడు రేప్ కేసులు, 35 పదవి దుర్వినియోగం అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అతడికి 21 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించారు. ఈ కేసులో 6,000 గంటల కంటే ఎక్కువ అసభ్యకరమైన, ప్రమాదకరమైన వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోగులకు తెలియకుండానే స్త్రీ జననేంద్రియ పరీక్షలు చేయించడం కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన ఛార్జిషీట్ కూడా బయటకు వచ్చింది. ఛార్జిషీట్ ప్రకారం.. నిందితుడు ఎటువంటి వైద్య కారణం లేకుండా మహిళల ప్రైవేట్ భాగాలలో ‘బాటిల్ వంటి’ స్థూపాకార వస్తువును చొప్పించాడు. అలాగే, విచారణలో బై రికార్డ్ చేసిన అనేక బాధాకరమైన వీడియోలను కోర్టులో ప్రదర్శించారు. ప్రభుత్వ న్యాయవాది రిచర్డ్ హౌగెన్ లింగ్ కేసును విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా వద్ద దాడికి సంబంధించిన వీడియో రికార్డింగ్ ఉంది. ఈ కేసులో మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. ఛార్జిషీటులోని నేరాన్ని వీడియో ద్వారా వివరించవచ్చు.” అని పేర్కొన్నారు. అతడికి 21 ఏళ్ల శిక్ష కూడా విధించారు.