IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో 12 మంది ప్రత్యేకం.. పంత్ చరిత్ర సృష్టిస్తాడా?
- సౌదీ అరేబియాలో ఐపీఎల్ 2025 మెగా వేలం
- నవంబర్ 24, 25 తేదీల్లో బిడ్డింగ్
- మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లు
- గరిష్టంగా 204 మంది ఆటగాళ్ల విక్రయం
- ఈ సారి రిషబ్ పంత్ చరిత్ర సృష్టిస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్‌లో ఇది 18వ వేలం కావడం విశేషం. మెగా వేలం ప్రారంభంలోనే మార్క్యూ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఇందుకోసం బీసీసీఐ 12 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జోస్ బట్లర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, మిచెల్ స్టార్క్ పేర్లు మార్క్యూ జాబితా మొదటి జాబితాలో ఉన్నారు. రెండో జాబితాలో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కి చోటు దక్కింది. ఈ 12 మంది ఆటగాళ్లలో 11 మంది ప్రాథమిక ధర రూ.2 కోట్లు. కాగా డేవిడ్ మిల్లర్ బేస్ ధర రూ.1.5 కోట్లు. జోస్ బట్లర్ ను ముందుగా వేలం వేయనున్నారు.
మార్క్యూ జాబితా-1 (M1):
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
జోస్ బట్లర్ (ఇంగ్లండ్)
శ్రేయాస్ అయ్యర్ (భారతదేశం)
రిషబ్ పంత్ (భారతదేశం)
అర్ష్‌దీప్ సింగ్ (భారతదేశం)
కగిసో రబడ (దక్షిణాఫ్రికా)
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
మార్క్యూ జాబితా-2 (M2):
KL రాహుల్ (భారతదేశం)
యుజ్వేంద్ర చాహల్ (భారతదేశం)
లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్)
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)
మహ్మద్ షమీ (భారతదేశం)
మహ్మద్ సిరాజ్ (భారతదేశం)
పంత్‌కు చరిత్ర సృష్టించే అవకాశం!
ఈ రెండు రోజుల మెగా వేలంలో అందరి దృష్టి.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై ఉంది. రూ. 24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ రికార్డును రిషబ్ బ్రేక్ చేయొచ్చు. రిటెన్షన్స్ తర్వాత అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 641.5 కోట్ల మొత్తం మిగిలుంది. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ. 110.50 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 83 కోట్లు. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ. 73 కోట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఉన్నందున ఈ ధరకు అతడిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ప్రతి రెండేళ్లకోసారి జట్టును మార్చుకునే పంజాబ్ కింగ్స్‌కు అవకాశం వరించనుంది. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ తన అభిమాన ఆటగాడితో మళ్లీ కలవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. వేలంలో 81 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.2 కోట్లు. ప్రస్తుత భారత క్రికెటర్లు ఒక మిలియన్ డాలర్లను (రూ. 8.5 కోట్లు) దాటగలరు. గత మూడు సీజన్లలో 96 టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్ కూడా భారీ బిడ్ పొందవచ్చు. ఫాస్ట్ బౌలర్లకు కూడా చాలా డిమాండ్ ఉంటుంది.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?